తెలుగు చలన చిత్రపరిశ్రమలో బ్రాండ్ అంబాసిడర్స్ లో కాస్ల్టీ ఎవరని అంటే టక్కున వినపడే పేరు మహేశ్ బాబు. మహేశ్ ఖాతాలో లెక్కలకొద్ది ఎండార్స్‌మెంట్స్ ఉన్నాయి. మహేశ్ కిట్టీలో ఎప్పుడూ డజనుకు పైగా బ్రాండ్స్ ఉంటూనే ఉంటాయి. ఈ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు మహేశ్ కోట్లకు కోట్లు ఛార్జ్ చేస్తూ ఉంటాడు. అయితే మహేశ్ బాబు ని ఉచితంగా వాడుకుంటున్న ఏకైక సంస్థ టిఎస్ఆర్టి టిసి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి టికెటింగ్…
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మాతృమూర్తులకు గొప్ప సదావకాశాన్ని కల్పిస్తోంది. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఈ నెల 8న తల్లులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. ఐదేండ్లలోపు చిన్నారులతో కలిసి తల్లులు అన్ని బస్సుల్లో ఆదివారం ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అమ్మ అనురాగాన్ని, ప్రేమను వెలకట్టలేమని, ఆ త్యాగమూర్తుల విశిష్ట సేవలను గుర్తుచేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నామని సజ్జనార్ వెల్లడించారు. మదర్స్ డే సందర్భంగా ఆర్డినరీ నుంచి ఏసీ వరకు అన్ని…
టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు అధినేత కేసీఆర్. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా కావాలని ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ప్లీనరీ తీర్మానం చేసింది. ప్రత్యమ్నాయ ప్రజల అజెండాతో అమెరికా తరహా అభివృద్ధి సాధ్యమన్నారాయన. రాబోయే ఎన్నికల్లో తొంభై శాతం సీట్లు తామే గెలుస్తామని కుండబద్దలు కొట్టారు కేసీఆర్. ఈ ప్లీనరీలో మొత్తంగా 13 తీర్మానాలు ప్రవేశపెట్టారు. అలాగే కేంద్రంపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు కేసీఆర్. రాష్ట్రం…
ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ తీపికబురు చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (డీఏ)పై కీలక నిర్ణయం తీసుకుంటూ.. వివరాలను ప్రకటించింది. వచ్చే వేతనాల నుంచి అందుకునేలా 5 శాతం డీఏను చెల్లించనున్నట్టు, మూల వేతనంపై 5 శాతం అంటే.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుందని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు…
రంజాన్ సందర్భంగా ప్రయాణికులకు శుభవార్త అందించింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. కార్గో సర్వీసు ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఆర్టీసీని గాడిన పెట్టేపనిలో భాగంగా ఎండీ సజ్జనార్ వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నారు.ప్రతీ పండగ సందర్భంగా కొత్త కొత్త డిస్కౌంట్లను ఆయన ప్రవేశపెడుతున్నారు. తాజాగా రంజాన్ మాసం సందర్భంగా ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీకి సంబంధించిన కార్గో, పార్శిల్ ఛార్జీలపై 25శాతం తగ్గింపు…
దేశంలో రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న వేళ అందరూ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడ చూసిన ఎలక్ట్రిక్ వాహనాలే దర్శనిచ్చేలా కనిపిస్తోంది. అయితే తాజాగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా త్వరలో ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే శనివారం బస్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉన్నతాధికారుల కీలక సమావేశం జరిగింది. 9 ఏళ్ల తరువాత ఆర్టీసీ బోర్డ్ తొలిసారి భేటీ కావడం విశేషం. ఈ సమావేశం…
ప్రజల్లోకి వెళ్లేందుకు టీఎస్ ఆర్టీసీ కొత్తకొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు మరో అడుగు వేస్తోంది టీఎస్‌ఆర్టీసీ. ఇప్పటికే పలు విధాల కార్యక్రమాలతో ఆర్టీసీని అందుబాటులోకి తీసువచ్చారు. టీఎస్‌ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువచ్చేందు నిర్వారామంగా కృషి చేస్తున్నారు. నిత్యం ట్విట్టర్ స్పందిస్తూ.. ప్రయాణికుల సమస్యలే కాకుండా.. ఆర్టీసీ ఉద్యోగల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు. అయితే తాజాగా టీఎస్‌ఆర్టీసీలో ప్రయాణిస్తే…
ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దిక్కుతోచకుండా వున్న ప్రయాణికులపై మరో భారం మోపింది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. ఒకటికాదు ఏకంగా రెండుసార్లు టికెట్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ బస్ పాస్ ధరలను కూడా బాగా సవరించింది. దీంతో 30 శాతం వరకూ బస్ పాస్ ఛార్జీలు పెరిగాయి. తాజాగా ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ పిడుగు వేసింది. రిజర్వేషన్ ఛార్జీలు పెంచేసింది. పెంచిన రిజర్వేషన్ ఛార్జీలపై ఇప్పటి వరకు అధికార ప్రకటన చేయలేదు ఆర్టీసీ. గుట్టుచప్పుడు కాకుండా…
ఈ మధ్యే చిల్లర కష్టాలకు చెక్పెడుతూ.. చార్జీల రౌండప్ పేరుతో భారీగా వడ్డించిన తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పుడు మరోసారి ప్రయాణికులకు షాక్ ఇస్తూ మళ్లీ చార్జీలను పెంచింది. డీజిల్ సెస్ పేరుతో అదనంగా ప్రయాణికులపై భారం వేసింది.. ఇక నుంచి బస్సు సర్వీసుల్లో కనీస ధర రూ.10గా నిర్ణయించింది టీఎస్ఆర్టీసీ.. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో రూ. 2 చొప్పున చార్జీలు పెరగనుండగా.. ఎక్స్ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ. 5…
వీసీ సజ్జనార్.. గతంలో పోలీస్ అధికారిగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన వ్యక్తి. ఆర్టీసీ రథసారథిగా బాధ్యతలు చేపట్టాక ప్రగతి రథాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆర్టీసీలో కూడా సమూల మార్పులు తీసుకుని వచ్చేందుకు, ఆర్టీసిని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సజ్జనార్ ఖమ్మంలో ఆర్టీసి బస్ స్టాండ్ ను ఆకస్మికంగా తనిఖి చేస్తే.. ఆయన వద్ద కు వచ్చి సెల్పీ ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. అంటే ఆర్లీసీలో కూడా ఆయన మార్క్ ప్రయాణికుల…