TSRTC: మాతృదినోత్సవానికి ఆర్టీసీ కానుక.. తల్లులందరికీ ఉచిత ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మాతృమూర్తులకు గొప్ప సదావకాశాన్ని కల్పిస్తోంది. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఈ నెల 8న తల్లులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. ఐదేండ్లలోపు చిన్నారులతో కలిసి తల్లులు అన్ని బస్సుల్లో ఆదివారం ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అమ్మ అనురాగాన్ని, ప్రేమను వెలకట్టలేమని, ఆ త్యాగమూర్తుల విశిష్ట సేవలను గుర్తుచేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నామని సజ్జనార్ వెల్లడించారు. మదర్స్ డే సందర్భంగా ఆర్డినరీ నుంచి ఏసీ వరకు అన్ని బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ సామాజిక దృక్ఫథంతోను అడుగు ముందుకేస్తోందని, ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక రాయితీలు కూడా కల్పిస్తున్న వైనాన్ని ఆర్టీసీ అధికారులు గుర్తు చేశారు. ఇప్పటికే చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే సందర్భంగా ఇలాంటి అవకాశాలు కల్పించారు. నిరుద్యోగ యువతకు కూడా పాస్‌లలో 20 శాతం రాయితీ అందిస్తున్నారు. అలాగే మాతృదినోత్సవం రోజున ఆర్టీసీ అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు, మాతృమూర్తులు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Also Read
#TSRTC is delighted to present a special offer to celebrate the day & give them a unique experience of FREE TRAVEL in all the bus services, including AC services. #mothers travelling with children below five years can avail the offer on 8th May, 2022 #MothersDay2022 pic.twitter.com/X1EpYeMt07
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 6, 2022
తాజావార్తలు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!