తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు అధికారులు. దూర ప్రాంత సర్వీసులకు చార్జీల పెంపుపై ఎలాంటి సమస్య లేకపోయినా… నగర, పల్లెవెలుగు సర్వీసులకు ప్రయాణ దూరం తక్కువగా ఉండడంతో వాటి చార్జీలు ఏవిధంగా పెంచాలన్న అంశంపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా చిల్లర సమస్య తలెత్తకుండా టికెట్ల ధరను సర్దుబాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల సర్వీసులకు కిలో మీటరుకు పావలా చొప్పున పెంచితే… కొన్ని ప్రాంతాలకు టికెట్ ధర 186 రూపాయలు, ఇంకొన్ని ప్రాంతాలకు 204…