తెలంగాణలో భానుడు భగభగ మండిపోతున్నాడు. భానుడి సెగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
Summer Healtcare: రాష్ట్రంలో భానుడు భగభగ ఇంకా మూడ్రోజుల్లో మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రోజూ వారి ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Temperatures: తెలంగాణ, ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు.
క్రింది స్థాయి ఈశాన్య, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలులు వీస్తు్న్నాయని.. రాబోయే నాలుగైదు రోజులు పాటు తెలంగాణలో మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రావణి పేర్కొన్నారు. ఈశాన్య జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
రాగల మూడురోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు.
TS Rains: తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి శుక్రవారం రాత్రి వాతావరణ బులెటిన్‌ను విడుదల చేసింది.
TS Weather : ఓ వైపు ఎండలు మండుతున్నాయి.. అదే క్రమంలో వాతావరణం చల్లగా మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు మూడు రోజులుగా ఇదే పరిస్థితి రాష్ట్రంలో తలెత్తింది. దీంతో జనాలు ఎప్పుడు వాన పడుతుందో.. ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియక అయోమయంలో ఉన్నారు.