CM Revanth Reddy : తెలంగాణలో ఇసుక అక్రమ రవాణా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఈ సమస్యపై సమగ్రంగా చర్చించారు. అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అణచివేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొనగా, ఇసుక రీచ్‌ల తనిఖీలు, అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వాహనాల…