నేడు విజయనగరం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గుర్లలో డయేరియా బాధితులకు అయన పరామర్శిస్తారు. ఉదయం 11 గంటలకు నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్ఎస్ఆర్ పేట మంచినీటి పథకంను పరిశీలిస్తారు. నేటి నుండి 27 వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఎలాంటి పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి…