ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. గుంటూరులో జిన్నా టవర్ అంశం ఇరు పార్టీ నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా మారింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ట్వీట్ చేశారు. 2014–19 మధ్య రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించిన బీజేపీకి గుంటూరులో జిన్నా టవర్ ఉందని గుర్తుకు రాలేదు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరవాత,…