Paracetamol Pregnancy Safety: అగ్రరాజ్యాధినేతగా ఎప్పుడూ వార్తల్లో నిలవడం డోనాల్డ్ ట్రంప్‌కు అలవాటు అయిపోయింది. తాజాగా ఆయన గర్భిణీలు పారాసెటమాల్ వాడితే ప్రమాదం అనే వాదనను తీసుకొచ్చారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు గర్భిణీలు పారాసెటమాల్ వాడటంపై పెద్ద వివాదం చెలరేగుతుంది. అమెరికాలో పారాసెటమాల్ టైలెనాల్ అనే బ్రాండ్ పేరుతో చెలామణి అవుతుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టైలెనాల్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఆటిజం ప్రమాదం పెరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.…