Trump On TikTok: టిక్‌టాక్ సేవలకు సంబంధించి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్‌టాక్ కంపెనీలో సుమారు 50 శాతం వాటా యూఎస్ పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా కండిషన్ తో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆ సేవలను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు.