ట్రంప్ నిర్ణయం భారతీయ వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. H-1B వీసా హోల్డర్లలో 70 శాతం మంది ఇండియన్స్ ఉన్నారు. ట్రంప్ నిర్ణయంపై భారత్ స్పందించింది. ఒక ప్రకటనలో ‘‘H-1B వీసా ఫీజు పెంపు చాలా కుటుంబాలకు ఇబ్బంది కలిగించే విధంగా మానవతా పరిణామాలను కలిగిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా అధికారులు ఈ విషయాన్ని పరిష్కరిస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు కూడా పేర్కొంది.’’ అని తెలిపింది.
Dallas Incident: గత వారం డల్లాస్ మోటల్ ఘటనలో, ప్రవాస భారతీయులు, కర్ణాటకు చెందిన చంద్రనాగమల్లయ్య హత్య ఎన్ఆర్ఐలో భయాలను పెంచింది. అత్యంత దారుణంగా నిందితుడు నాగమల్లయ్య తల నరికి, శరీరం నుంచి వేరు చేసి, దానిని కాలితో తన్నిన వీడియోలు వైరల్‌గా మారాయి. నిందితుడిని 37 ఏళ్ల క్యూబాకు చెందిన వలసదారులు యార్డానిస్ కోబోస్ మార్టినేజ్‌గా గుర్తించారు. నాగమల్లయ్యను ఆయన భార్య, కుమారుడి ముందే అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన, ప్రవాస భారతీయుల్లో భయాందోళనల్ని…
దేశాలపై సుంకాలతో ట్రేడ్ వార్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ లిస్ట్ లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, ఇతర దేశాలు ఉన్నాయి. వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ట్రంప్ సర్కార్ మొత్తం 41 దేశాలతో మూడు జాబితాలను సిద్ధం చేసిందని తెలిపింది. మొదటి జాబితాలో 10 దేశాలు చేర్చబడ్డాయని,…