Charlie Kirk: డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడైన చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఉటాకు చెందిన 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్‌ను నిందితుడిగా గుర్తించినట్లు ఉటా గవర్నర్ స్పెన్సర్ జె కాక్స్ తెలిపారు. నిందితుడు ఇటీవల కాలంలో రాబిన్సన్ ‘‘రాజకీయంగా తీవ్రంగా ప్రభావితం అయ్యాడు’’ అని గవర్నర్ చెప్పారు. ముఖ్యంగా, చార్లీ కిర్క్ నమ్మకాలను వ్యతిరేకిస్తున్నాడని, హత్య చేసింది తానే అని తన ఫ్యామిలీ ఫ్రెండ్‌కు చెప్పినట్లు వెల్లడించారు.