హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్ కొత్త డ్రామాలకు తెర తీశారని, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి ఆరోపించారు. రైతులు పండించిన పంటను ప్రతీసారి రాష్ర్ట ప్రభు త్వమే ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు రైస్ మిల్లర్లకు సరఫరా చేసి ఎఫ్‌సీఐకి లేవీ పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రీఎంబర్స్‌మెంట్ ద్వారా డబ్బులు తీసుకునే ఆనవాయితీ ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర…
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉందని బీజేపీ మహిళా నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాజా పరిస్థితిని గమనిస్తే…. కేంద్రం వద్ద బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) నిల్వలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి… వాటిని వినియోగించేందుకు కొన్నేళ్లు పడుతుంది కనుక… 2020-21 యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ నుంచి 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకుంటుంది. మిగిలిన బియ్యం రా రైస్ (పచ్చి…
కేంద్రం నుంచి రావల్సినవి తెచ్చుకోవడం మా హక్కు అని కేసీఆర్ అన్నారని, నిధులు రాబట్టే విషయంలో మిగిలిన వారు కూడా అలాగే వ్యవహరిస్తారని మేము బిచ్చమెత్తుకుంటే మీకెంటని తెలంగాణ టీఆర్ ఎస్ నేతలకు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నేతలు ఈ విధంగా మాట్లాడటం వారి రాజకీయ అజ్ఞానమే అవుతుం దన్నారు. కేంద్రం నుంచి నిధులను రావాల్సిన పద్ధతుల్లో రాబట్టు కుంటున్నామన్నారు. వారు ఎలా పోవాలో వారు చూసుకోవాలి, మేము ఎలా పోతే వారికేమిటీ…
బియ్యం కొనుగోలు విషయంలో తెలంగాణ సర్కార్ పూటకో నాటకం ఆడుతుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కేంద్రంపైనా, బీజేపీ నాయకత్వంపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని ఆమె ధ్వజమెత్తారు. బాయిల్డ్ రైస్( ఉప్పుడు బియ్యం) కొనుగోలు అంశంలో టీఆర్‌ఎస్ నేతలు, మంత్రలు చేస్తున్న దుష్ప ప్రచారం చేస్తున్నారన్నారు. పలు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉన్న సూక్ష్మ పోషకాలు కలిగిన ఉప్పుడు బియ్యాన్ని నెలకు 5లక్షల టన్నులు ఇచ్చినా కొంటామని ఎఫ్‌సీఐ తెలంగాణ జీఎం స్పష్టం చేసినా తెలంగాణ…
మంత్రి ప్రశాంత్ రెడ్డికి పేర్నినాని కౌంటరిచ్చారు. మాకు రావాల్సిన నిధుల కోసం బిచ్చమెత్తుకుంటున్నామని… మాటి మాటికి ఢిల్లీ వెళుతున్న కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి వెళుతున్నారంటూ మండిపడ్డారు పేర్నినాని. తెలంగాణలో వరి కొనుగోళ్ళ రచ్చ జరుగుతుంటే… ఈ కొత్త గొడవేంటని రాజకీయ విశ్లేషకులు అవాక్కవుతున్నారు. విపక్షాలు మాత్రం కీలక విషయాలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి సిల్లీ విషయాలను తెరమీదకు తెస్తున్నారని కామెంట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు పేర్ని నాని. ఇక అంతకు ముందు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి…
జనంతో బాగా గ్యాప్ వచ్చిందని ఆ జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీలు ఆందోళన చెందుతున్నారా? మళ్లీ ప్రజలకు దగ్గర య్యేందుకు డివోషనల్ బాట పట్టారా? సడెన్‌గా ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇంతకీ ఎవరా నాయకులు? ప్రజాప్రతినిధుల భక్తి లెక్కలు వేరా? గుస్సాడీ నృత్యాలు.. కార్తీక దీపోత్సవాలు..! ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇవన్నీ ఏ ధార్మిక సంస్థలో నిర్వహిస్తున్నాయంటే పొరపాటు. ఫౌండేషన్ ద్వారా కొందరు.. సొంతంగా మారికొందరు తమలోని భక్తిని భారీగానే బయటపెడుతున్నారు.…
ధర్నా చేసే హక్కు అందరికీ ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌పై పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తే పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కానీ మేము అడిగితే మాత్రం ఏవేవో కారణాలు చెప్పి ధర్నాలకు అనుమతి నిరాకరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ధర్నా చేద్దాం అన్నా, అనుమతి ఇవ్వని…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలనే ముఖ్య డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరఫున టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే… ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే… దానం నాగేందర్.. తన నియోజక వర్గం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే… దానం…
ధాన్యం కొనుగోలుపై తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో టీఆర్‌ఎస్ నేతలు నిర్వహించిన ధర్నాలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వైఖరి తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. అప్పుడు తెలంగాణ కోసం ఉద్యమిస్తే.. ఇప్పుడు రైతుల కోసం ఉద్యమించాల్సి వస్తోందన్నారు. జై కిసాన్ నినాదాన్ని.. నై కిసాన్ గా కేంద్ర ప్రభుత్వం మార్చిందన్నారు. రా రైస్ అంటూ బీజేపీ నేతలు తేలివిగా మాట్లాడుతున్నారని..…
మాజీ మంత్రి, ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… ఒక్క సారిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్… నిర్వహించిన ఓ శుభకార్యంలో సందడి చేశారు. అదేంటి… టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దగ్గరికి ఈటల రాజేందర్ వెళ్లడమేంటని అనుకుంటున్నారా ? అవును ఇది నిజమే. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ గారి కుమార్తె వివాహ వేడుకకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈటల…