ఖరీఫ్ పంట రోడ్డు మీద ఉంటే పంట కొనే ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదని నారాయణపేట కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తు వ్యాఖ్యలు చేశారు. మా పంట కొనండి అని రైతులు ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడ్డట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ బీజేపీలు రెండు కుమ్మకై నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్రం ఖరీఫ్‌లో పండించింది మేము తీసుకుంటామని చెప్పిన, మనం పండించిన పంటను ఎందుకు కొనరో…
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు… టీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేసిన ఆయన.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడంలేదు.. అయితే, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు లేఖరాసిన గట్టు రామచంద్రరావు… “నేను మీ అభిమానాన్ని పొందడంలో.. గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యాను.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని భావించాను.. అందుకే పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు..…
సీఎం కేసీఆర్‌కు రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టీఆర్‌ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. వరి కల్లాల్లో ధాన్యం ఉన్న కొనకుండా కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు. కేసీఆర్.. ప్రధాని మోడీ ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం, టీఆర్‌ఎస్ డ్రామాలు ఆడుతూ రైతులను…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది… వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది మినహా అందరూ నామినేషన్లు ఉపసహరించుకోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.. దీంతో వరంగల్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ మరో సారి నిలబెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ ఈ కోటాలో మండలి స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు వేసిన ఎత్తుగడలు…
ఉపఎన్నికలో కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన తేరా చిన్నపరెడ్డికి ఎందుకు రెన్యువల్ చేయలేదు? తేరా వర్గానికి ఎక్కడ తేడా కొట్టింది? అధికారపార్టీ నిర్ణయంపై చిన్నపరెడ్డి వర్గం స్పందన ఏంటి? తేరా ప్లేస్‌లో కోటిరెడ్డి అభ్యర్థి..! ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీ బరిలో నిలిచిన ఆయన భారీగా ఖర్చు చేశారు. మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోగా.. తర్వాత రెండేళ్లకు వచ్చిన ఉపఎన్నికలో గెలిచారు.…
ఆ జిల్లాల నుండి ఒకరు ఇద్దరు కాదు.. ఎనిమిదిమంది ఎమ్మెల్సీలు…మండలిలో వరంగల్లు జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యత దక్కిందా?తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వరంగల్లుకు కెసీఆర్ న్యాయం చేస్తున్నారా?శాసన మండలిలో వరంగల్ జిల్లా ఆధిపత్యం కనిపించనుందా? మండలిలో తెలంగాణలో ఏ ఇతర జిల్లాకు రానంత ప్రాధాన్యం వరంగల్ జిల్లాకు వచ్చిందా..?అవుననే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎంఎల్సీ పదవుల్లో సింహభాగం ఓరుగల్లుకే దక్కాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎమ్మెల్సీలున్న జిల్లాగా వరంగల్ జిల్లాకు గుర్తింపొచ్చింది.…
రైతుల ఉసురు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తగులుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులపై కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సీజన్‌లో ధాన్యం ఎంతయినా కొనాలని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, అయినా కేసీఆర్ వచ్చే సీజన్‌కు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు ముందు చూపు లేకపోవడం వల్లనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్కువ ధరకు వడ్లు అమ్ముకొవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రైతులతో పెట్టుకున్న వారు ఎవ్వరూ ముందుకు పోలేదని కేసీఆర్…
టీఆర్ఎస్ పార్టీపై టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న సందర్భంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్ పత్రాలను టీఆర్‌ఎస్ కార్యకర్తలు చించివేయడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఘటనలపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. నగరం నడిబొడ్డున ప్రజాస్వా మ్యం ఖూనీ అయ్యిందన్నారు. పోలీసుల సమక్షంలో ఎంపీటీసీల సం ఘం అధ్యక్షురాలి నామినేషన్ పత్రాలు చించివేత జరుగుతున్నా పోలీ సులు…
రాష్ర్టంలో గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు, యాసంగి వరి పంటపైన తీవ్ర చర్చ జరుగుతుంది. అసలు వరిపంట కొనుగోలుపై ఎప్పుడు రానీ కష్టం.. ఇప్పుడేందుకు వచ్చింది. ఈ విషయం పై ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని విమర్శిస్తుంటే, అధికార టీఆర్‌ఎస్ మాత్రం నెపాన్ని కేంద్రం మీద తోస్తుంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. దీనిపై రాజకీయాలు ఎలా ఉన్న చివరికి నష్ట పోయేది మాత్రం సగటు రైతన్నలే.. కేంద్రం దీనిపై ఏం చెబుతుంది…
కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం ఢీల్లో కేంద్రమంత్రులు, ప్రధానిని కలి సేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించిదని ఇది యావత్ తెలంగాణ ప్రజలను అవమానించడమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్టానికి ధాన్యం కొనుగోలు విష యంలో స్పష్టత ఉందని, కేంద్రం మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వ డం లేదని ఆయన మండిపడ్డారు. యాసంగికి ఎన్ని సన్న వడ్లు కొం టారు, ఎన్ని దొడ్డు వడ్లు కొంటారో చెప్పాలని…