కొంతకాలం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ధ్వజమెత్తుతోన్న సంగతి తెలిసిందే! అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వస్తోన్న తరుణంలో, ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని సిద్ధం చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే! బీజేపీయేతర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పలుసార్లు సమావేశమయ్యారు. ఇక జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు వస్తుండడంతో.. ప్రతిపక్ష కూటమి అభ్యర్థిని…