ఎలాంటి ఎజెండా లేకుండా మత పరమైన రాజకీయాలు, గుడుల చూట్టు రాజాకీయాలు చేస్తుంది ఈ బీజేపీ పార్టీనే అని ఆరోపించారు. సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సండ్ర ను నాల్గోసారి గెలిపించాలని ఆయన కోరారు.
TRS MLC TATA Madhu Fired On Telangana BJP Leaders. తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్లు పరిస్థితి ఉంది. బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తూంటే.. మరోవైపు టీఆర్‌ఎస్ నేతలపై బీజేపీ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించిస్తున్నారు. అయితే ప్రస్తుతం ధాన్యం కొనుగోలు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ తీరుపై దశల వారి ఉద్యమాలు చేపడుతున్నామన్నారు.…