TRS MLC Tata Madhu: సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సండ్రను నాల్గోసారి గెలిపించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు కోరారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. రేపు ఎల్లుండి సత్తుపల్లి నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ అభినందన సభ ఉంటుందని పేర్కొ్న్నారు. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలల్లో రోడ్ షో ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన సభ్యులు అందరూ టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ప్రజా ప్రతి నిధులను అందరిని ఆహ్వనించామన్నారు. అలానే సినియర్ నాయకులు తుమ్మల, పొంగులేటిని ఆహ్వనించామని తెలిపారు.
Read also: Yadadri Temple: యాదాద్రి నర్సన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి
ఈనెల 19 న వేంసూరు మండలంలో ర్యాలీ నిర్వహించి రాజ్యసభ సభ్యుడు బండి పార్దసారదిరెడ్డి స్వగ్రామం కందుకూరు లో ఆత్మీయ అభినందన సభ ఉంటుందని వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు రెండు రాజ్యసభ సభ్యులను ఇవ్వటంతో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపటానికే ఈ సభ ఏర్పటు చేశామన్నారు. మునుగోడు ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం తరుపున ఎమ్మెల్యే సండ్ర అద్వర్యంలో గెలుపుకోసం పాటుబడిన ప్రతి ఒక్కరికి ఎం. ఎల్. సి. తాతా మధు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి డైరెక్షన్ ఏంటి? అనేది రేపు నాయకులు సభలో మాట్లాడుతారన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని బలంగా చెయ్యటానికి ఇలాంటి సభలు మరిన్ని పెట్టాలని తెలిపారు. ఇలా నెలకోకసారి సభలు పెడితే పార్టీ బలంగా ఉంటుందన్నారు. మడోసారి కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చి హ్యాట్రిక్ కొడుతుందని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ వ్యక్తిగత దోషణలకు పోతున్నారే తప్పే ప్రజల సంక్షేమం పట్టించుకోదన్నారు. ఎలాంటి ఎజెండా లేకుండా మత పరమైన రాజకీయాలు, గుడుల చూట్టు రాజాకీయాలు చేస్తుంది ఈ బీజేపీ పార్టీనే అని ఆరోపించారు. సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సండ్ర ను నాల్గోసారి గెలిపించాలని ఆయన కోరారు.
QR code for LPG Cylinders: ఎల్పీజీ సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్..