హైదరాబాద్ మాదాపూర్ హెచ్‌ఐసీసీ వేదికగా టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్‌లు, పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లు ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. ఈ ప్లీనరీ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం 13 తీర్మానాలు చేయనుంది. జాతీయ రాజకీయాలపై మంత్రి కేటీఆర్ తీర్మానం చేయనున్నారు. వరి కొనుగోలుపై మంత్రి నిరంజన్‌రెడ్డి తీర్మానం చేయనున్నారు. ధరల పెరుగుదలపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానం చేయనున్నారు. మరోవైపు కేంద్ర పన్నుల వాటాపై…
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటా జెండా పండగ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు వారి వారి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రాణాలను పణంగాపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్..…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరపనున్నారు. పార్టీ 22వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఇతర మండలస్థాయి ప్రతినిధులకు ఆహ్వానం ఉంటుంది. ఇటు ప్రత్యేక ఆహ్వానితులుగా.. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. Read Also: COVID 19: కరోనాకు కొత్త మందు.. స్ప్రేతో…