హుజూరాబాద్ ఉప ఎన్నికపై టిఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇప్పటికే మండలాల వారిగా పార్టీ ఇంచార్జీలను నియమించింది. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు కూడా నియెజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఉప ఎన్నిక షెడ్యులు వచ్చేనాటికి నియెజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంపై టిఆర్ఎస్ నేతలు దృష్టి పెట్టారు. పార్టీ శ్రేణులను ఉప ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో ఉన్నారు ముఖ్యనేతలు. ప్రధానంగా నియెజకవర్గంలో ఉన్న సామాజిక సమీకరణాలపై…