Bhatti Vikramarka : ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేదలకు ఉచిత వైద్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ఇకపై హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన…
Seethakka In Assembly: తెలంగాణ శాసన మండలిలో గురుకుల పాఠశాలల్లో కలుషిత ఆహార సమస్యలపై జరిగిన చర్చలో మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని, హాస్టల్ సిబ్బందితో పాటు సరఫరాదారులపై కూడా నిఘాను పెంచుతామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 70 సంఘటనలు నమోదయ్యాయని, అందులో 5024 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని మంత్రి సీతక్క గుర్తుచేశారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ పరిస్థితి…
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చెప్పిన అబద్దాలకు అక్కడి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే అన్ని హామీలు అమలు చేసినట్లు చేసిన దొంగ ప్రచారానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి మహారాష్ట్రలో తిమ్మిని బమ్మిని చేద్దామనుకున్న రేవంత్…