మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ప్రకటించిన ‘అయినను పోయిరావలె హస్తినకు’ ప్రాజెక్ట్ ఆగిపోయిన విషయం తెలిసందే. దీంతో ఎన్టీఆర్ కొరటాలతో… త్రివిక్రమ్ మహేశ్ తో తమ తమ ప్రాజెక్టులను సెట్ చేసుకున్నారు. త్రివిక్రమ్-మహేశ్ సినిమా మే 31న హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆరంభం కానుంది. 2022 సమ్మర్ లో విడుదల కానుంది. ఇక మహేశ్ సినిమా తర్వాత త్రివిక్రమ్ జూనియర్ తో సినిమా చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం…
ప్రిన్స్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మూడో చిత్రానికి లైన్ క్లియర్ అయ్యింది. అన్ని అనుకున్నట్టు జరిగితే… అతి తర్వలో ఈ మూవీ అధికారిక ప్రకటన వస్తుందట. ‘అతడు, ఖలేజా’ సినిమాల చేదు అనుభవాన్ని మరిపిస్తూ… వీరి సరికొత్త చిత్రం ఉండాలని అభిమానులంతా ఆశపడుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత ఎన్టీయార్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడంటూ ఆ మధ్య అధికారిక ప్రకటన వచ్చింది. ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత పట్టాలెక్కే ఎన్టీయార్ సినిమా ఇదే…