ట్రిపుల్ తలాక్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. షరియత్ కౌన్సిల్ ప్రైవేట్ సంస్థ అని, కోర్టు కాదని న్యాయమూర్తి అన్నారు. ప్రస్తుతం విచారించిన కేసు 2010లో వివాహం చేసుకున్న ముస్లిం డాక్టర్ దంపతులది. భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాడని.. అయితే మూడో తలాక్ పై భర్త ఎప్పుడూ ప్రస్తావించలేదని భార్య ఆరోపించింది.