తన ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు అందిస్తున్న సేవలలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.. ఇప్పటి వరకు నగదు చెల్లింపుల ద్వారానే ఆర్టీసీ లావాదేవీలు నిర్వహిస్తుండగా.. క్రమంగా డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత ఏర్పడిన సమయంలో.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. యూపీఐ/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులను స్వీకరించడానికి ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది ఆర్టీసీ.. మొదటగా.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్సెల్, కార్గో సెంటర్ అలాగే రేథిఫైల్ బస్ స్టేషన్ (సికింద్రాబాద్)…
తరచూ రైళ్లలో ప్రయాణించేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. రైళ్ల రాకపోకలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే.. కొత్తగా తీసుకున్న నిర్ణయాలు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయని ప్రకటన విడుదల చేసింది. కొత్త రైళ్లను అందుబాటులోకి తేవడమే కాకుండా కొన్ని మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లుగా, కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చింది. అంతేకాదు పలు రైళ్లను దారి…
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా.. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది… ఇప్పటికే భారత్లో కొత్తి వేరింట్ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 10 దాటేసింది… ఈ కేసులు వెలుగుచూసిన రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది కేంద్రం.. మరోవైపు.. మహారాష్ట్రలో డెల్టా కేసులు పెరుగుతున్న తరుణంలో కర్ణాటక – మహారాష్ట్ర సరిహద్దుల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.. పోలీసు, వైద్యశాఖ సంయుక్తంగా చెక్‌పోస్టు ఏర్పాటు చేసింది.. ఇక, మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి వచ్చేవారికి…
భారత్లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. ఇతర దేశాలు భారత్ పేరు చెబితేనే వణికిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. విదేశాల్లో ఉన్న తమ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఆ దేశం.. భారత్‌లో ఉన్నవాళ్లపై ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడంపై నిషేధం విధించింది. ఇది ఎవరైనా అతిక్రమిస్తే.. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆసీస్ అత్యవసరంగా తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం.. తమ పౌరులు…