కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా.. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది… ఇప్పటికే భారత్లో కొత్తి వేరింట్ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 10 దాటేసింది… ఈ కేసులు వెలుగుచూసిన రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది కేంద్రం.. మరోవైపు.. మహారాష్ట్రలో డెల్టా కేసులు పెరుగుతున్న తరుణంలో కర్ణాటక – మహారాష్ట్ర సరిహద్దుల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.. పోలీసు, వైద్యశాఖ సంయుక్తంగా చెక్‌పోస్టు ఏర్పాటు చేసింది.. ఇక, మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి వచ్చేవారికి తప్పనిసరిగా కరోనా నెగటివ్ రిపోర్టు ఉండాల్సిందేననే నిబంధన పెట్టారు.. సరిహద్దులోని కాగ్నలి చెక్‌పోస్టు దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు.. ఇతర చెక్‌పోస్టులలోనూ నిఘా పెంచిన అధికారులు.. కేరళ సరిహద్దులోనూ ఇదే తరహా ఆంక్షలు కొనసాగిస్తున్నారు.. ఇప్పటి వరకు కరోనాతో.. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్‌తో మరింత అప్రమత్తం అయ్యింది కర్ణాటక.