అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ కొత్త ప్రకటనపై సంతకం చేశారు. దీనితో పాటు, మరో 7 దేశాల నుంచి వచ్చే వ్యక్తులపై కఠినమైన ఆంక్షలు విధించారు. అమెరికా జాతీయ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ట్రంప్ ఈ చర్య తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ వంటి 12…
మొత్తం 43 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశాలను 3 జాబితాలుగా వర్గీకరించారు. ఈ జాబితాలో పాకిస్తాన్, ఉత్తర కొరియా, రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి.
Travel Ban on Sri Lanka Former Cricketer Sachithra Senanayake: శ్రీలంక మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సచిత్ర సేనానాయకే ప్రస్తుతం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో కొలంబోలోని స్థానిక కోర్టు అతడు విదేశాలకు వెళ్లకుండా సోమవారం నిషేధం (ట్రావెల్ బ్యాన్) విధించింది. 38 ఏళ్ల సేనానాయకే లంక ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచ్‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లను…
మే 9, 2022 ఘర్షణలకు సంబంధించి మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై విధించిన విదేశీ ప్రయాణ నిషేధాన్ని శ్రీలంక కోర్టు బుధవారం ఎత్తివేసింది. రాజపక్సేతో పాటు, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు కూడా పూర్తిగా ఎత్తివేసింది.
కోవిడ్ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్ లిస్ట్ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో,…
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోగా… కొత్త వేరియంట్లు.. డెల్టా, డెల్టా ప్లస్ కలవర పెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో భారత్ నుంచి రాకపోకలపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది ఫీలిప్పైన్స్.. ఇప్పటికే చాలా దేశాలు భారత విమానాలపై బ్యాన్ విధించగా.. ఇప్పటికే భారత్ నుంచి రాకపోకలపై ఉన్న నిషేధాన్ని జులై 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ఫీలిప్పైన్స్.. ఇక, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఒమన్, యూఏఈ దేశాలపై కూడా ఈ నిషేధ ఆంక్షలు…