ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 29 మృతదేహాలను గుర్తించలేదు. ఘటన జరిగి రెండు నెలలు గడుస్తుంది. జూన్ లో జరిగిన రైలు ప్రమాదంలో 294 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షలు అందించనుండగా.. గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వనుంది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం వైయస్.జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంఓ కార్యాలయ అధికారులతో కలిసి.. ఈ ప్రమాద ఘటనపై ఆయన సమీక్షించారు. తాజా సమాచారం ప్రకారం 237 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్యకూడా భారీగా ఉందని వివరించారు.
ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం మోగింది. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. మరో 900 మందికిపైగా గాయపడగా.. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు.