హైదరాబాద్ నగరంలో ఈరోజు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ట్యాంక్‌బండ్ పరిసరాల వైపుకు గణపయ్యలు పెద్ద ఎత్తున కదిలి వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో నిమజ్జన కార్యక్రమాలు ఆలస్యం అయ్యాయి. దీంతో ఈరోజు కూడా నిమజ్జనం జరుగుతున్నది. నిమజ్జనం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక ఉదయం నుంచి ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలన్నీ గణపయ్య వాహనాలతో నిండిపోయాయి. నిన్న మధ్యాహ్నమే ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. వర్షంలోనే శోభాయాత్ర…
ఖైరతాబాద్‌లో భారీ గణపతి కొలువుదీరిన కారణంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. గణపయ్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు కాబట్టి వీలైనంత వరకు ప్రజలు సొంత వాహనాల్లో కాకుండా మెట్రో లేదా పబ్లిక్ వాహనాల్లో రావాలని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఖైరతాబాద్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహం మీదుగా వెళ్లే వాహనాలకు అనుమతించడంలేదు. లక్డీకపూల్‌లోని రాజ్‌దూత్ మీదుగా వచ్చే వాహనాలను మార్కెట్ వైపుకు మళ్లిస్తున్నారు. ఇక నెక్లెస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలకు ఐమాక్స్‌లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు…
తెలంగాణలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లడమే కాదు.. గ్రామాలు, పట్టణాల్లోని ముంపు ప్రాంతాల్లో జలమయం అయ్యాయి.. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.. ఇక, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి… ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి వరద నీరు.. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని కందకుర్తి బ్రిడ్జిపై…
హైదరాబాద్ నగరంలో మొన్నటి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బయటకు అడుగు పెడితే చాలు ఎప్పుడు వర్షం కొడుతుందనని అందరూ భయపడుతున్నారు. ఇక శనివారం సాయంత్రం కూడా భాగ్య నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మలక్ పేట, అంబర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఇలా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కిలో మీటర్ల పొగవున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ముఖ్యంగా వర్షం కారణంగా మలక్ పేట…
ప్రతి ఆదివారం రోజున సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్ రోడ్లను మూసేస్తున్నట్లు ఇప్పటికే పోలీసు అధికారులు ప్రకటించారు. కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతించేందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మార్గంలో ప్రయాణం చేసే వాహనాలను దారిమళ్లించనున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణం చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సందర్శకులకు ట్యాంక్‌బండ్ చివర పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేసినట్టు ట్రాఫిక్…
రాత్రి సమయంలో ట్యాంక్‌బండ్ అందాలను వీక్షించేందుకు వందల సంఖ్యలో నగరవాసులు అక్కడికి వస్తుంటారు. ఒకవైపు పర్యాటకులతో పాటు, ట్రాఫిక్ రద్ధీకూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్స్‌లో ఈ రద్ధీ అధికం. దీంతో ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ప్రతి ఆదివారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయాలని హైదరాబాద్ సీపీని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరవాసుల ట్యాంక్‌బండ్ సందర్శనకు…
ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు పోలీసులు. ఇప్పటి వరకు చలానా విధించినా వాహనదారులు వాటికి కట్టకుండా లైట్‌గా తీసుకొని వాహనలు నడుపుతున్నారు. తీరిగ్గా ఎప్పుడైనా కట్టుకోవచ్చులే అంటున్నారు. అయితే, ఇకపై అలాంటి ఆటలు సాగవని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వాహనంపై ఏ ఒక్క చలానా కూడా పెండింగ్‌లో ఉండకూడదని, ఒకవేళ పెండింగ్‌లో చలానాలు ఉంటే వాహనాన్ని వెంటనే సీజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. వాహనానికి సంబందించి ఒక్క చలానా పెండింగ్‌లో ఉన్నా…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు జస్టిస్ ఎన్వీ రమణ.. రాజ్‌భవన్‌లో ఆయన బస చేస్తున్నారు.. రోజూ పలువురు ప్రముఖులు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిన్న యాదాద్రి వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు ఎన్వీ రమణ దంపతులు.. మరోవైపు, ఇతర ప్రముఖులను కలిసిందేకు ఆయన కొన్ని సార్లు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు.. ఇవాళ ఎస్ఆర్ నగర్ లోని తన నివాసానికి వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ ను నిలిపివేశారు పోలీసులు.. ఇది గుర్తించిన సీజేఐ..…