హైదరాబాద్ నగరంలో రోడ్లపై నానాటికీ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ఐటీ కార్యాలయాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలులో ఉన్నా రోడ్లపై ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద భారీ మార్పులు చేయాలని నిర్ణయించారు. పలు జంక్షన్ల వద్ద రాకపోకలపై త్వరలో ఆంక్షలు విధించనున్నారు. రద్దీ జంక్షన్‌ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌ను పెట్టేందుకు యోచిస్తున్నారు. Read Also: స్వల్పంగా పెరిగిన హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు నగరంలోని…
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఎందుకంటే ఈ హైవేను సూపర్ ఇన్ఫర్‌మేషన్ రహదారిగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్-బెంగళూరు హైవే సూపర్ హైవేగా వాహనదారులకు సేవలు అందించనుంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఒకవేళ మీరు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే.. ఆ ప్రాంతం నుంచి బయటపడేందుకు ఎంత సమయం పడుతుంది?, ఎక్కడెక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి?, ఆస్పత్రులు ఎంత దూరంలో ఉన్నాయి? వంటి కీలక సమాచారాలను డిజిటల్ బోర్డుల రూపంలో హైవే…
సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పట్టారు. దీంతో స్వగ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు పయనం అయ్యారు. సోమవారం నుంచి ఆఫీసులు తెరుచుకోవడంతో ఉద్యోగులు సొంతూళ్ల నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. Read Also: పశువుల పండగలో విషాదం.. పొట్టేలుకు బదులు మనిషి బలి సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల రాకపోకలు సోమవారం రెట్టింపు స్థాయిలో ఉన్నాయని…
సంక్రాంతిని పురస్కరించుకొని ప్రయాణీకులు తమ స్వంత ఊళ్లకు బయలు దేరారు. అయితే ప్రభుత్వం 8వ తేది శనివారం నుంచే విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించగా 9వ తేది ఆదివారం ఉదయం నుంచే విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. కాగా 13 గురువారం కూడా కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి లోట్ ప్లాజా, విజయవాడకు సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద…
ట్రాఫిక్ బాగా పెరిగిపోతోంది. రోడ్ల మీదకి వెళ్ళి ప్రయాణాలు చేయడం కష్టంగా మారింది. ప్రపంచంలో జనాభా ఎక్కువగా వుండే దేశాల్లో అయితే బహుళ ప్రయోజనకర వాహనాలు తెరమీదకు వస్తున్నాయి. నీటిలో, నేలపై నడిచే కార్లు అన్నమాట. ఇప్పుడు పట్టాలపై నడుస్తూ.. అవసరమయితే రోడ్లమీద పరుగులు పెట్టే రైల్ కం బస్సుల ఆవశ్యకత ఎంతో వుంది. ప్రపంచంలోనే తొలి రైలును పోలిన బస్సు తెరమీదకు వచ్చింది. దీనిని డ్యూయల్ మోడ్ వాహనం అండే డీఎంవీ అనవచ్చన్నమాట. డీఎంవీ ఒక…
ట్రాఫిక్ రూల్స్ వాహనదారులకు షాకిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే… ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారికి కూడా కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనదారులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు 10 చలాన్ల కంటే ఎక్కువ ఉంటే వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ట్రైనిగ్ ఇనిస్టిట్యూట్ కు పోలీసులు పంపిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ లో ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘటనలకు…
తుపాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అల్లాడుతోంది. తుపాన్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, దాన్ని ఎదుర్కొనేందుకు తిరుపతిలో యంత్రంగం సిద్ధంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతిలో తుపాన్ ప్రభావంతో దెబ్బ తిన్న ప్రాంతాలలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. జోరు వాన, గాలిని సైతం లెక్కచేయకుండా కలియదిరిగారు. లక్ష్మీపురం కూడలి వద్ద మోకాలి లోతైన నీటిలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. అశోక్ నగర్ వద్ద చెట్టు…
అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు విచిత్రంగా జరుగుతుంటాయి. నెట్టింట సందడి చేస్తుంటాయి. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా సీసీటీవీల ద్వారా చూసి అసలు విషయాలు కనిపెడుతుంటారు. కొన్నిసార్లు సీసీ కెమెరా ఉన్నది అని తెలుసుకోకుండా చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఈ చిన్న సంఘటన కూడా ఒకటి. బ్రెజిల్ అంటేనే అమెజాన్ అడవులకు, వేలాది పక్షులు, వన్యమృగాలకు ప్రసిద్ది. Read: వైరల్: బుడ్డోడి టాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా… అలాంటి పచ్చని…
అల్పపీడనం,భారీవర్షాల కారణంగా నెల్లూరు జిల్లా తడిసిముద్దవుతోంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానలతో ప్రజలు అల్లాడుతున్నారు.నెల్లూరు నగరంతో పాటు గూడూరు, కావలి,సూళ్లూరుపేట,వేలాది గ్రామాల్లో ప్రజలు అసలు రోడ్ల పై నడవలేనంతగా ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. దీంతో రోడ్లు దారుణంగా పాడైపోయాయి. నెల్లూరు నగరంలో చాలా చోట్ల నీరు చేరి నిలిచిపోయింది. దీంతో వాహనాలు రోడ్ల పై తిరగలేక,అండర్ బ్రిడ్జిల కింద ఇరుక్కుపోతున్నాయి. ప్రభుత్వం,అధికారులు తమ ఇక్కట్లు, ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.…
నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ సమయంలో వాహనాల నుంచి వచ్చే కాలుష్యంతో పాటుగా హారన్ నుంచి వచ్చే శబ్ధకాలుష్యంకూడా పెరిగిపోతున్నది. ఫలితంగా అనేక అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కో వాహనం ఒక్కో రకమైన హారన్ శబ్దంతో కర్ణకఠోరంగా మారుతున్నది. వీటిని కంట్రోల్ చేసేందుకు కేంద్ర ఉపరితల రావాణ శాఖ ముందుకు వచ్చింది. కొత్త రూల్స్ ను తీసుకురాబోతున్నది. వాహనాల్లో హారన్ శబ్దాన్ని మార్చాలని నిర్ణయం తీసుకుంది. హారన్ శబ్దాలు కఠినంగా ఉండకుండా హాయిగా ఉండేలా చూడాలని ఇప్పిటికే…