Lal Darwaja Bonalu: హైదారబాద్ లోని ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు.
Balkampet Yellamma: రేపు (జూలై 9)న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కల్యాణం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సారించారు.జూలై 8న కళాకారులతో పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్ ఆర్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9న ఆలయానికి తూర్పు వైపున ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో అమ్మవారి కల్యాణం నిర్వహిస్తారు. 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే…
Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఈ నెల 9న వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కల్యాణానికి సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
Traffic Restrictions: హైదరాబాద్ వాహనదారులకు కీలక గమనిక... రేపు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. రేపు (సోమవారం) ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా అధికారులు పలు ఏర్పాట్లు చేశారు.
ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈరోజు ఏపీలో పర్యటించిన ప్రధాని, ఈ నెల 8వ తేదీన విజయవాడకు రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. ప్రధాన రోడ్లలో సరుకు రవాణా వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు సహా అన్ని వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నారు. మరోవైపు.. రోడ్ షోలో పాల్గొనటం కోసం వచ్చే వారికి…
ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు.. తూర్పు గోదావరి జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో ప్రధాని ప్రచారం కొనసాగనుంది.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి రానున్నారు ప్రధాని మోడీ.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. అనంతరం విశాఖ జిల్లా అనకాపల్లి బయలుదేరి వెళ్తారు.. ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు..
ఈ నెల 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో.. రాజమండ్రి, చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, ఇతర రాష్ట్ర, జిల్లాల నుండి వచ్చే, పోయే వాహనాలకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు.. కడియం మండలం వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్, ఆంక్షలు విధించారు పోలీసులు.. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ క్రింది విధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో…