Lal Darwaja Bonalu: హైదారబాద్ లోని ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం వద్ద భక్తుల కొలహలం నెలకుంది. ఈ ఏడాది లాల్ దర్వాజా 116 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు అధికారులు. అమ్మవారికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు బోనాలు సమర్పించే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాల కోసం అన్ని శాఖల సమన్వాయంతో ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు బోనాలు అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు. రెండో రోజు రంగం భవిష్యవాణి, పోతరాజుల ఆటపాటలతో ఘటాల ఊరేగింపు ఉండనుంది. సుమారు 500 కు పైగా పోలీస్ బందోబస్తు, ఆలయంచుట్టు సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. బోనాలు సందర్బంగా ఆలయం వద్ద 5 క్యూ లైన్ లు ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చే మహిళా భక్తులకు రెండు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు.
Read also: Hyderabad Crime: ఎస్ ఆర్ నగర్ లో దారుణం.. హాస్టల్ లో యువకుడి హత్య..
మరి కొద్దీ సేపట్లో ప్రభుత్వం తరుపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పాతబస్తి లోని ప్రధాన 23 ఆలయాల వద్ద బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శాలబండ అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మరోవైపు కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ, మీరాలం మండి మహంకాళి ఆలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సబ్జీ మండి నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇంకా చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎన్టీఆర్ నగర్ సరూర్ నగర్ ఖిలా మైసమ్మ ఆలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, నాచారం ఉప్పల్ మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఇక.. లాల్‌దర్వాజ బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 100 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా.. లాల్ దర్వాజ బోనాలు సందర్భంగా 2,500 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. పాత బస్తీలోని ఫలక్‌నుమా, చార్మినార్, బహుదూర్‌పురా, మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈనెల 28, 29 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఆదివారం బోనాల ఊరేగింపు, సోమవారం ఘటాల ఊరేగింపు పాతబస్తీలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు. అక్కన్న మాదన్న దేవాలయం నుండి నయాపూల్ వరకు ఏనుగుపై ఈ భారీ ర్యాలీ తెల్లవారుజాము నుండి రాత్రి వరకు కొనసాగుతుంది. కాగా.. లాల్ దర్వాజ దేవాలయం, ఎంజీబీఎస్, రెతిఫైల్, జేబీఎస్ వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు… సమాచారం కోసం 9959226154, 9959 226160 నంబర్లలో సంప్రదించవచ్చని వెల్లడించారు.
https://www.youtube.com/live/zbAqGb0I6Bk
Alanaati Ramachandrudu: ‘అలనాటి రామచంద్రుడు’ కూడా వచ్చేస్తున్నాడు