Balkampet Yellamma: రేపు (జూలై 9)న బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కల్యాణం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సారించారు.జూలై 8న కళాకారులతో పుట్టమన్ను తీసుకొచ్చి ఎస్ ఆర్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవస్థానానికి ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9న ఆలయానికి తూర్పు వైపున ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో అమ్మవారి కల్యాణం నిర్వహిస్తారు. 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో రథోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి.
Read also: OnePlus Nord 4 : భారత్ మార్కెట్ లోకి రానున్న ” వన్ ప్లస్ నోర్డ్ 4 “.. ఫీచర్లు ఇలా..
గతేడాది నిర్వహించిన కల్యాణానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఈసారి కూడా భక్తుల రద్దీ దృష్ట్యా సౌకర్యాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయ సమీపంలోని రహదారున్నీ మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆంక్షలపై భక్తులు, ప్రయాణికులు గమనించాలన్నారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఎల్లమ్మ ఆలయంలో కల్యాణోత్సవం పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని సూచించారు.
Read also: US Shooting: అమెరికాలో దారుణం.. కాల్పుల్లో ఇద్దరు మృతి, 19 మందికి గాయాలు
మళ్లింపు ఇలా..
* అమీర్‌పేట, బేగంపేట నుంచి వచ్చే వాహనాలను ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా సోనీ వైన్స్, ఉమేష్‌చంద్ర విగ్రహం మీదుగా పంపుతున్నారు.
* సనత్‌నగర్, ఫత్తేనగర్, బేగంపేట బైపాస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఆరు అడుగుల రోడ్డు, బల్కంపేట్ బతుకమ్మ చౌరస్తా నుంచి ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట మీదుగా మళ్లిస్తున్నారు.
* ఈ నెల 9న ఎల్లమ్మ కల్యాణం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ సమీపంలోని నాలుగు చోట్ల వాహనాల పార్కింగ్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. భక్తులు తమ వాహనాలను ఫతేనగర్ రైల్వే సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఇరువైపులా పార్క్ చేయాలని, బల్కంపేట్ ప్రకృతి క్లినిక్, ఎస్‌ఆర్‌నగర్‌లోని రోడ్లు మరియు భవనాల శాఖ, అమీర్‌పేటలోని శ్రీ గురుగోవింద్ సింగ్ ప్లే గ్రౌండ్స్‌లో ఉంచాలని సూచించారు.
Gautam Gambhir: అతడే టీమిండియా అత్యుత్తమ కెప్టెన్: గంభీర్