Nalgonda: బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అలాగే మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈనెల 12న నిర్వహించాల్సిన ఈ మహాధర్నాను సంక్రాంతి పండుగ కారణంగా వాయిదా వేసి 21న నిర్వహించేందుకు నిర్ణయించారు. కానీ, ఆ రోజుకు అనుమతి నిరాకరించిన పోలీసులు,…
Traffic Rules In Hyderabad: హైదరాబాద్ నగరంలో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ సమయంలో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పునరుద్ధరణ చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలలో, మూడు కమిషనరేట్ల పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయడం, బేగంపేట్ టోవ్లీచౌకి ఫ్లైఓవర్ సహా ఇతర ఫ్లైఓవర్లను కూడా మూసివేయడంచేయనున్నారు. అయితే, పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై ఎయిర్‌పోర్టుకు…
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 11గంటల నుండి ఉదయం 5గంటల వరకు వాహనాల పోకల్ని నిషేధిస్తూ ఓఆర్‌ఆర్, ఫ్లైఓవర్‌లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తప్పనిసరి. బార్లు, పబ్బులు, క్లబ్‌లు నిబంధనలు పాటించాలని సూచించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. శీతాకాల విడిది కోసం విచ్చేసిన రాష్ట్రపతికి హైదరాబాద్‌లోని హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌లు ఘన స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు బెజవాడలో పర్యటించనున్నారు.. విజన్ 2047 రిలీజ్ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. ఇక, సీఎం సభ సందర్భంగా బెజవాడలో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు.. బందరు రోడ్డులో పూర్తిగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Hyderabad Air Show: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర మంత్రులు, వీవీఐపీలు, సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పాల్గొంటారు.
Hyderabad Traffic: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు రానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయబోతున్నారు.
Hyderabad-Vijayawada: విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలకు హైవేపై మరోసారి అవరోధం ఏర్పాడింది. గరికపాడు దగ్గర పాలేరు బ్రిడ్జి దెబ్బ తిన్నది. ఇది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులోని పాలేరు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తూ రోడ్డును కోసివేయటంతో బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
Traffic Restrictions: హైదరాబాద్ నగరంలో రన్నర్స్ మారథాన్ రన్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో రేపు (ఆదివారం) ఉదయం 4. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు.