గాంధీ కుటుంబం పై అక్రమ కేసుల విషయంలో మోడీ ప్రభుత్వ దమననీతిని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో భాగంగానే రాహుల్ ..సోనియా గాంధీకి బీజేపీ నోటీసులు ఇచ్చిందన్నారు. గాంధీ కుటుంబంకి అండగా ఉంటామని, సోనియా గాంధీ మీద ఈగ వాలినా అంతు చూస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గాంధీ కుటుంబం మీద అక్రమ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. నేషనల్…
అధికారిక వాహనాల్లో రేపులు జరిగితే కూడా పట్టదా..? అంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. అధికారిక వాహనాల్లో కూడా అత్యాచారాలు జరిగినా చర్యలు తీసుకోవడం లేదు అంటే కెసిఆర్ ప్రోస్తహిస్తున్నట్టే అని విమర్శలు గుప్తించారు. కెసిఆర్ కో నచ్చితే నజరానా..? లేదంటే శిక్షలు అంటూ మండిపడ్డారు. కెసిఆర్..ఎంఐఎం పాలనలోనే పొత్తు కాదు, అత్యాచారాలు కూడా పొత్తు ల్లోనే చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ నీ ఎందుకు తీసేయడం…
ఇవాళ్టి నుండి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం ప్రారంభం కానుంది. రైతు డిక్లరేషన్ పై పల్లె పల్లెకు కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే.. నేడు ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో రచ్చబండలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదునూరు గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. కొమురవల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, హుజూర్‌నగర్‌లోని చింతలపాలెం మండలం బుగ్గ మాదారం…
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పీవీని, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళను ప్రధానినీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో దళితుడు భట్టిని సీఎల్పీ నేతగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా దళితున్ని ఓర్వలేక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీచ చరిత్ర మీదంటూ టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. రాహుల్ మీద నువ్వు ఏ…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఇటీవల రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల నేతలు రాహుల్ పర్యటనపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా నేడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. సింగిల్ విండో చైర్మన్‌గా ఓడిపోయినా… కేసీఆర్‌కి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అని, కేసీఆర్.. మొదట ఎమ్మెల్యేగా ఓడిపోలేదా..? అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా కేసీఆర్ రాజకీయ…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు ఎందుకు వస్తున్నావ్.. అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ హాయంలో రైతులు ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా.. ట్విట్టస్త్రాలు సంధించారు. పోలీసు పహారాలేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో…
TPCC President Revanth Reddy Outraged on TPCC working Prsident Jagga Reddy and OU Students Arrest. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఓయూ విద్యార్థులు నేడు మినిస్టర్స్ క్వాటర్స్ ముట్టడికి యత్నంచారు. ఈ నేపథ్యంలో ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన ఓయూ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు…
నల్గొండ జిల్లాలో నేడు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ కేటీఆర్.. ప్లీనరీలో కేసీఆర్ మాటలు చూస్తుంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటారెమో..? అని ఆయన వ్యాఖ్యానించారు. ప్లీనరీలో కేసీఆఆర్.. ఎన్టీఆర్‌ని స్మరించారన్నారు. కేసీఆర్ తెలంగాణలో పోత్తుల గురించి ఆలోచిస్తున్నారు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ నీ ముచ్చింతలకి ఎస్‌పీజీ వాళ్ళు రావద్దు అని చెప్పారు అని ఎప్పుడో చెప్పిన.. మీరే వినలేదు.. కేటీఆర్ మీడియా ముందే…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, సాయుధ పోరాట పటిమ గల నాయకత్వం ఈ జిల్లాలో ఉందన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ కాంగ్రెస్ కట్టామని సగర్వంగా చెప్పుకుంటామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. మేము మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మలు మీరు.. అని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లికల్లు లిఫ్ట్…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. పీసీసీ చీఫ్ అయ్యాక మొదటి సారిగా ఆయన ఖమ్మం వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సభ విజయవంతం కోసం కార్యకర్తలతో మాట్లాడనున్నారు. వరంగల్ లో వచ్చే నెలలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సభ జరుగనుంది. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ…