Kashmir: ప్రకృతి సౌందర్యానికి, మంచు అందాలకు నిలయమైన కాశ్మీర్ భారతదేశపు స్వర్గభూమిగా పేరొందింది. అందుకే పర్యాటకలు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే గత మూడేళ్లుగా కరోనా, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో టూరిస్టుల సంఖ్య భారీగా తగ్గింది. కానీ ఇప్పుడు కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో సందర్శకులు కాశ్మీర్ లోయకు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రికార్డు స్థాయిలో ప్రజలు ఈ ప్రాంతంలో పర్యటించారు.