నవారో సంచలనం.. యుఎస్ ఓపెన్‌లో కొకో గాఫ్ కథ ముగిసే! యుఎస్ ఓపెన్ 2024 నుంచి టాప్ సీడెడ్ల నిష్క్రమణ కొనసాగుతూనే ఉంది. పురుషుల టైటిల్ ఫెవరెట్స్ నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరాజ్ ఇప్పటికే ఇంటిదారి పట్టగా.. తాజాగా మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ కొకో గాఫ్ కథ కూడా ముగిసింది. గాఫ్‌కు అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారో ప్రిక్వార్టర్స్‌లో షాకిచ్చింది. నాలుగో రౌండ్లో 6-3, 4-6, 6-3తో గాఫ్‌ను నవారో ఓడించింది. 60 అనవసర…
నేడు కీలక కేసుల్లో తీర్పులు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు, సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. శాంతిస్తున్న కృష్ణమ్మ. క్రమంగా తగ్గుతున్న కృష్ణా నది వరద ఉదృతి. 12 లక్షల క్యూసెక్కుల వరద నీటికి చేరకుండా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తగ్గుతున్న నీటి మట్టం. నిన్న రాత్రి 9 గంటలకు 11.13 లక్షల వరద ప్రవాహం.…
దెబ్బతిన్న రైల్వే ట్రాక్స్‌కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ మహబూబాబాద్ రూట్ లో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. మూడు చోట్ల సుమారు వెయ్యి మంది సిబ్బందితో ట్రాక్ మరమ్మతు పనులను చేపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే జీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్ష బీభత్సానికి రైల్వే వ్యవస్థ అతలాకుతలమైంది. రైల్వే ట్రాక్‌లు పలుచోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. జోన్ పరిధిలో 101 రైళ్లు పూర్తిగా, మరో…
కృష్ణమ్మ ఉధృతితో కొట్టుకొస్తున్న బోట్లు.. విజయవాడ రైల్వే బ్యారేజీకి 3 అడుగుల దూరంలో వరద నీరు విజయవాడలోని కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో విజయవాడలోని రైల్వే బ్యారేజ్ కి మూడు అడుగుల దూరంలో ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. వరద ప్రవాహం పెరిగితే రైల్వే ట్రాక్ పైకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గమ్మ వారధి మీదుగా, ప్రవహిస్తున్న లక్షల క్యూసెక్కుల నీరు.. ప్రకాశం బ్యారేజీ దిగువకు విడుదల…
నేడు జరగాల్సిన JNTU పరీక్షలు వాయిదా. 5వ తేదీకి వాయిదా వేసిన JNTU. నేడు ఉస్మానియా పరిధిలోని కాలేజీలకు సెలవు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. నేడు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు. ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద. 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల. ఇన్‌ఫ్టో 11,20,101 క్యూసెక్కులు. కెనాల్స్‌కు 500 క్యూసెక్కుల నీటి విడుదల. ఏపీకి ఆరు NDRF బృందాలు పంపనున్న కేంద్రం. 40 పవర్ బోట్లు…
పేర్ని నాని కారుపై కోడిగుడ్లతో దాడి.. గుడివాడలో ఉద్రిక్తత..! గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. మాజీ మంత్రి పేర్ని నాని కారు పైన కోడిగుడ్లతో దాడి జరిగింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కాచి మరి పేర్ని నాని కాన్వాయ్‌ను అడ్డుకుని కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. తమ అధినేతపై పేర్ని నాని చేసిన…
హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య.. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి.. భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్ (40), వర్షిణి (33)గా గుర్తించారు. వీరికి రిషికాంత్ (11), విహంత్ (3) పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆన్ లైన్ బెట్టింగ్ వ్యాపారం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ…
అమెరికాకు రాహుల్ గాంధీ.. డల్లాస్, వాషింగ్టన్ డీసీల్లో పర్యటన.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 8-10 తేదీల మధ్య ఆయన యూఎస్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లలోని టెక్సాస్ యూనివర్సిటీ సహా పలువురుని కలవనున్నారు. జూన్ నెలలో లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా రాహుల్ గాంధీ అమెరికా వెళ్లబోతున్నారు. ఆయన పర్యటన వివరాలను ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా పంచుకున్నారు. ‘‘రాహుల్…
హైదరాబాద్ లో దొంగల హల్ చల్.. రూ.35 లక్షలు దోపిడీ.. హైదరాబాద్ లో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. నగరంలో దారి దోపిడీ దొంగల ముఠా అమాయకులను హడలెత్తిస్తున్నారు. వ్యాపారస్తులే టార్గెల్ చేస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాత్రి ఒంటరి వ్యక్తులే టార్గెట్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యాపారి వద్ద నుంచి సుమారు రూ.35 లక్షలు దోచుకుని వెళ్లిన ఘటన గుడిమల్కాపూర్ లో సంచలనంగా మారింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలోని తిబర్మల్ జ్యువెలర్స్…
వన మహోత్సవం.. మొక్కలు నాటి ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం.. మంగళగిరి ఎకో పార్కులో వన మహోత్సవాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కలిసి ప్రారంభించారు. ఎకో పార్కులో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఎకో పార్కుకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌లు స్వాగతం పలికారు. చెట్ల మధ్య డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రితో కలిసి సీఎం చంద్రబాబు నడిచారు. ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన…