అమరావతి: నేడు బెంగళూరుకు వైఎస్ జగన్. మధ్యామ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు జగన్. అమరావతి: వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సందర్భంగా కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టునున్న వైసీపీ శ్రేణులు. సూపర్ సిక్స్ సహా 143 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి. హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణలు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు. కోస్తా జిల్లాల్లో 39-40 డిగ్రీల…
కాంగ్రెస్ చట్టాలు రైతులకు మేలు చేస్తే.. బీఆర్ఎస్ చట్టాలు ప్రజలకు ఇక్కట్లను తెచ్చాయి తెలంగాణ ఆవిర్భావం జూన్ 02 రోజున భూ భారతి చట్టం అమల్లోకి వచ్చింది. భూ సమస్యలను లేకుండా చేసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భూ భారతి చట్టం చరిత్రాత్మకం అని అన్నారు.…
భారీగా పేలిన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులు..! ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న ప్రసిద్ధ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మళ్లీ భారీగా పేలింది. అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవడంతో, పెద్ద మొత్తంలో బూడిద మేఘాలు ఆకాశంలో ఏర్పడ్డాయి. పేలిన అగ్ని పర్వతం అగ్నిని, బూడిదను పొగలను వెదజల్లుతూ సమీప ప్రాంతాలను కమ్మేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో పర్వతం వద్ద ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. పక్కనుంచి బూడిద మేఘం విరుచుకుపడుతుండగా తమ ప్రాణాల కోసం…
‘ఉగ్రవాది లఖ్వీ జైలులో ఉండగా తండ్రయ్యాడు’.. ఉగ్రవాదంలో పాక్ ప్రమేయాన్ని వివరించిన ఓవైసీ ‘ఆపరేషన్ సింధూర్’ విజయం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తన వైఖరిని ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలు వివిధ దేశాలకు వెళ్లి, ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తున్న తీరును బయటపెడుతున్నాయి. ఈ ఎపిసోడ్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ ద్వంద్వ ప్రమాణాలను…
ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఇది మనదేశంలో కాదండోయ్ రష్యాలో. రష్యాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఒక వంతెన కూలిపోవడంతో ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కొన్ని బోగీలు కిందపడ్డాయి. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. కేకలు వేస్తూ పరుగులు తీశారు. ముగిసిన ఎషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్-2024.. 24 పతకాలతో భారత్..! 26వ ఎషియన్…
నేడు ఏపీఎస్పీ కానిస్టేబుల్ మొయిన్స్ రాత పరీక్ష. ఐదు ప్రధాన నగరాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష. నేటి నుండి ఏపీలో నెలలో 15 రోజులపాటు రోజు రెండు పూటల చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ. ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు చర్యలు. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు.. ఉదయం 8 గం.ల నుంచి…
14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డుల సంబరం.. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు..! తెలుగు చిత్రసీమలో మరోసారి సినీ అవార్డులతో వేదిక వెలుగులు నింపనుంది. 14 సంవత్సరాల విరామం తర్వాత ఉత్తమ తెలుగు సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డులను ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గద్దర్ గారి పేరుతో ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ఒక మహత్తరమైన గౌరవంగా భావిస్తున్నారు తెలంగాణ సినీ ప్రేమికులు. ఈ…
గ్రౌండ్ లోనే చితకొట్టుకున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. వీడియో వైరల్ క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ అని చెబుతారు. కానీ, అప్పుడప్పుడూ ఈ ఆటకు మచ్చ కలిగించే సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘోర సంఘటనే మే 28 (బుధవారం)న బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. ఢాకాలో జరిగిన ఎమర్జింగ్ జట్ల మధ్య నాలుగు రోజుల అనధికారిక టెస్టులో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఒకరినొకరు గ్రౌండ్ లోనే తోసుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో…
బార్డర్లో పాక్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడిన వీర వనిత.. పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఆపరేషన్ని ముగించుకుని వెనుదిరిగింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఇందులో ఒకరి పేరు సోఫియా ఖురేషి కాగా మరొకరి పేరు వ్యోమికా సింగ్. సోఫియా ఖురేషి భారత…
నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం! వ్యక్తిగతంగా నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనలు అని తెలిపారు. 1994లో ఉద్యమం మొదలైందని, ఎమ్మార్పీఎస్‌ది ముప్పై ఏళ్ల పోరాటమన్నారు. సమాజంలో అన్ని వర్గాల అండదండలతోనే ఉద్యమం సాధ్యమయిందన్నారు. సుప్రీంకోర్టు సైతం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం…