అల్లుడి కిడ్నాప్, హత్యకు స్కెచ్ వేసిన అత్త.. ట్విస్ట్ ఏంటంటే..? గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మణికంఠకు నాలుగేళ్ల క్రితం పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన లిఖితతో పెళ్లయింది. వీరికి ఒక కుమార్తె సంతానం.. అయితే, పెళ్లి జరిగినప్పటి నుంచి అత్త విజయలక్ష్మి ప్రవర్తన మణికంఠకు నచ్చలేదు. దీంతో, తన భార్య లిఖితను కూడా పుట్టింటికి దూరంగా ఉండాలని చెప్పారు. లిఖిత కూడా తల్లితో దూరంగా ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తన కూతుర్ని తనకు దూరం…
మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.. అయితే, కాస్త తెరపి ఇచ్చిన తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.. అయితే, 4 రోజుల తర్వాత దక్షిణ…
నేడు ఉద్యోగ సంఘతో ప్రభుత్వం కీలక చర్చలు.. దీపావళి ముందు గుడ్న్యూస్..! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టింది.. దీపావళికి రెండు రోజుల ముందు గుడ్ న్యూస్ చెప్పాలనుకుందో.. ఏమో.. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మంత్రులతో.. ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.. ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగుల డీఏ.. ఇతర అంశాలు చర్చించారు… ఇవాళ ముగ్గురు మంత్రులు.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు.. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహా మంత్రులు సత్యకుమార్ యాదవ్,…
చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏపీకి విజనరీ నాయకత్వం ఉంది ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి.. ఏపీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో విజనరీ నాయకత్వం ఉంది.. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తోంది అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అహోబిలం నరసింహస్వామి, మహానందీశ్వరుడికి నమస్కరిస్తున్నా.. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నా.. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన…