కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలువలోకి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన బాపులపాడు మండలం ఏ. సీతారాంపురం గ్రామంలో జరిగింది. ఏలూరు కాల్వలోకి స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఆదివారం కావడంతో సరదాగా కాలువలోకి స్నానానికి వెళ్లారు చిన్నారులు. మృతి చెందిన ఇద్దరు చిన్నారులు ఏ.సీతారాంపురం గ్రామానికి చెందిన రెడ్డి అజయ్, పోల యశ్వంత్ కృష్ణగా గుర్తించారు.…