బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్! అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. వెంటనే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి అతడిని పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా…
ఫైల్స్ దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్స్ దగ్ధం కేసులో మదనపల్లె మాజీ ఆర్డీవో మురళిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత పరార్ అయిన మురళి కోసం మదనపల్లి, తిరుపతి, హైదరాబాద్ లో అధికారులు గాలించారు. ఇక, తిరుపతిలోని కేఆర్ నగర్ లో ఉన్నట్లు తెలుసుకొని వెళ్లిన అతడ్ని సీఐడీ డీఎస్పీ డీవీ వేణుగోపాల్ బృందం అరెస్టు చేసింది.…
ఈ నెల 9న చిత్తూరులో జగన్ పర్యటన: చిత్తూరు జిల్లాలో ఈ నెల 9వ తేదీన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు. అలాగే, ఇప్పటికే హెలిప్యాడ్ కు అనుమతిచ్చిన…
వల్లభనేని వంశీని పరామర్శించిన కొడాలి నాని, పేర్నినాని కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో, ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఉన్న ఓ వైసీపీ నేత ఇంట్లో వంశీని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని ఆత్మీయంగా కలిసి పరామర్శించారు. అలాగే, వంశీ ఆరోగ్యంపై ఇరువురు నేతలు అడిగి తెలుసుకున్నారు. అయితే, వల్లభనేని వంశీ, కొడాలి నాని,…
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో సౌతాఫ్రికా నయా హిస్టరీ.. 27 ఏళ్ల నిరీక్షణకు తెర.. ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) మూడో రౌండ్ (2023-25) ఫైనల్లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా హోరాహోరీగా తలపడ్డాయి. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయ దుందుభి మోగించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో సౌతాఫ్రికా నయా హిస్టరీ క్రియేట్ చేసింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్…
భవనం పైకప్పుపై దొరికిన బ్లాక్ బాక్స్.. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన ‘‘బ్లాక్ బాక్స్’’ దొరికింది. విమానం కూలిపోతున్న సమయంలో సమీపంలోని డాక్టర్స్ హాస్టల్స్ భవనాన్ని ఢీకొట్టింది. ఇప్పుడు అదే బిల్డింగ్ పైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దీంతో, 265 మందిని బలి తీసుకున్న ఈ ఘోర దుర్ఘటనకు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన…
దారుణ హత్య.. ఇంటర్ విద్యార్థినిని పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు..! అనంతపురం నగరంలో మరోసారి నరమానవత్వం కలవరపెట్టే ఘటన జరిగింది. ఇంటర్ సెకెండియర్ చదువుతున్న ఓ యువతి దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యచేశారు. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అమానవీయ సంఘటన అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణిపాల్ స్కూల్ వెనుక భాగంలో చోటు చేసుకుంది. అక్కడ ఓ విద్యార్థినీ…