నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 5,6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి.. విజయవాడ పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి సీఎం వెళ్లనున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి.. మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీలను ఏపీ సీఎం కలవనున్నారు. ఇవాళ…
ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు: తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను అధికారులు ఓపెన్ చేశారు. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. ఈ ప్రక్రియ దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని.. అసలు కౌంటింగ్ ప్రక్రియ ఆ తర్వాత మొదలు కానుందని అధికారులు చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి.…
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఏపీలో మూడు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ఆరంభం అయింది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి.. తెలంగాణలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో మూడు…
భారీ భద్రత మధ్య గ్రూప్-2 పరీక్షలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు గ్రూప్-2 ప్రధాన పరీక్ష జరగనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. టైం దాటితే…
ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్రం షాక్.. 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు.. తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది కేంద్ర హోం శాఖ. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడ్డ ముగ్గురు అధికారులు.. వెంటనే ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది కేంద్ర హోంశాఖ.. అంతేకాదు, 24 గంటల్లోగా ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.. రాష్ట్ర విభజన సందర్భంగా ఈ…
పక్కింటావిడపై హత్యాయత్నం: వివాహేతర సంబంధం బయటపడుతుందన్న అనుమానంతో పక్కింట్లో నివాసం ఉంటున్న మహిళపై ప్రియుడు, ప్రియురాలు కలిసి హత్యాయత్నం చేశారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో ఈ ఘటన చోటుచేసుకుంది. గణపర్తికి చెందిన పొలిమేర దీపిక పిల్లలతో కలిసి మునగపాక ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటి పక్కన రాజ్‌కుమార్, సరిత దంపతులు ఉంటున్నారు. అచ్చుతాపురంలో ఓ కంపెనీలో రాజ్‌కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. భర్త రాజ్‌కుమార్ డ్యూటీకి వెళ్లిన తర్వాత తన ప్రియుడిని సరిత ఇంటికి రప్పించుకుంటోంది.…
పాలకొండకు వైఎస్ జగన్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన పాలకొండ వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ చేరుకోనున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. పరామర్శ అనంతరం పాలకొండ నుంచి నేరుగా బెంగుళూరుకు వెళ్లనున్నారు. ఇటీవల వైసీపీ సీనియర్…
వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గంట ముందే గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డ్‌కు బయలుదేరేందుకు షెడ్యూల్ ఖరారు కాగా.. తాజాగా ఓ గంట ముందే (9 గంటలకు) వెళ్లేలా షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఉదయం 10 గంటలకు మిర్చి యార్డ్‌కు వద్దకు చేరుకుని.. గిట్టుబాటు ధర రాక…