తిరుమలలో డ్రోన్ కలకలం.. టీటీడీ కీలక నిర్ణయం..! కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో డ్రోన్ కెమెరా వ్యవహారం కలకలం రేపుతోంది.. శ్రీవారి ఆలయం గగనతలంపై డ్రోన్ కెమెరాలకే కాదు విమానాలకు కూడా అనుమతి లేదు.. కానీ, తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో శ్రీవారి ఆలయం పరిసరాలు విహంగ వీక్షణంలో స్పష్టంగా కనిపించడం ఆందోళన కలిగించే విషయం.. ఈ వ్యవహారం ఒక్కసారిగా టీటీడీ అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు..…
కాంగ్రెస్‌లోనే చిరంజీవి.. సోనియా, రాహుల్‌తో మంచి సబంధాలు..! ఒంగోలులో నిన్న మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారని తెలిపారు.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని మీడియా ప్రతినిధులకు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.. ఇక, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీచేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని.. ఆ…
జీవో నంబర్ 1.. సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది.. బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలకు నియంత్రణ ఉండేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.. వివాదాస్పద జీవో నెంబర్ 1పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ జీవోపై స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో…
గులాబీ పార్టీ బాస్ ప్రసంగంపై ఉత్కంఠ మరో కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కె.చంద్రశేఖర్‌రావు.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత తొలి సారీ ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. తెలంగాణ జైత్రయాత్ర సాగించిన పోరు భూమి మరో సమర నినాదానికి సిద్ధమైంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని…
ఇవాళ హైదరాబాద్‌కు మూడు రాష్ట్రాల సీఎంలు.. కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు హైదరాబాద్ రానున్నారు. జనవరి 18న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతన్ ఖమ్మం పాల్గొననున్నారు.యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. వీరంతా రేపు ఉదయం సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి వెళ్లనున్నారు. స్వామివారి దర్శనానంతరం అందరూ ఖమ్మం సభకు…
ఆ కారుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం.. రతన్ టాటా పోస్ట్ వైరల్ రతన్ టాటా పరిచయం అవసరం లేని పేరు.. టాటా గ్రూప్‌ను రూపొందించిన రతన్ టాటా.. వ్యాపారంలోనే కాదు సామాజిక సేవలోనే ఎంతో పేరు పొందారు.. ఆయనకు సోషల్ మీడియాలో పెద్ద అభిమానుల ఫాలోయింగ్‌ను కూడా కలిగి ఉన్నారు.. ఆయన అనేక త్రోబాక్ పోస్ట్‌లను పంచుకుంటూ ఉంటారు.. అయితే, ‘టాటా ఇండికా’ను ప్రారంభించిన 25 సంవత్సరాలు అవుతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఓ భావోద్వేగ పోస్టును…
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఏ రోజు ఏ టికెట్లు విడుదల చేస్తారంటే.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాలని చూస్తున్న భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం.. ఎందుకంటే.. వరుసగా వివిధ దర్శనలు, సేవల టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇవాళ ఉదయం 9 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ.. జనవరి 12వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సంబంధించిన ఈ టికెట్లను ఆన్లైన్లో…
డ్రగ్స్ కేసులో నేడు మోహిత్ విచారణ డ్రగ్స్ కేసులో ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నార్కోటిక్ అధికారులు మోహిత్ ను ప్రశ్నించనున్నారు. ఎడ్విన్‌తో సంబంధాలపై కూపీ లాగనున్నారు. మోహిత్ కు 50 మంది ప్రముఖులతో కాంటాక్టులు ఉన్నాయని భావిస్తున్న అధికారులు వీటిపై ఆరా తీయనున్నారు. మోహిత్ ను ఒకరోజు కస్టడీకి నాంపల్లి కోర్టు నిన్న అనుమతి ఇచ్చింది. అటు డ్రగ్స్ కేసులో మరో నిందితుడు కృష్ణ కిషోర్ కు కోర్టు బెయిల్ మంజూరు…
చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.. షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు చంద్రబాబు.. అయితే, రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో.. ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.. మరోవైపు, చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు ఎటువంటి అనుమతులు లేవని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు పోలీసులు.. చంద్రబాబు రోడ్ షో, సభల్లో…
రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధించిన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.. రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఇక, జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్, మార్జిన్లకు నిబంధనలు వర్తింపజేయనున్నారు.. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. రోడ్లకు దూరంగా ప్రజలకు…