నేడు సొంత జిల్లాకు సీఎం జగన్.. స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న స్టీల్ ప్లాంట్‌కు ఇవాళ భూమిపూజ చేయనున్నారు.. సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంటుకు భూమిపూజ చేస్తారు. అలాగే పులివెందులలో ఓ శుభకార్యంలో పాల్గొననున్నారు.. కడప జిల్లా పర్యటన కోసం ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ఉదయం 10.50…
కేసీఆర్ కొండగట్టు పర్యటన రేపటికి వాయిదా.. షెడ్యూల్ ఇదే.. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని సీఎం కేసీఆర్ బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు. కానీ.. ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి మంగళవారం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో తన పర్యటనతో భక్తులకు ఇబ్బందులు కలగకూడదని భావించిన సీఎం తన పర్యటనను బుధవారం వాయదా వేసుకున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. రేపు ఉదయం సీఎం…
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా.. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించిన ప్రభుత్వం. ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో ఆవిర్భావ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 27, 2019న కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. నాలుగేళ్లలో ప్రస్తుతం నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఈ సచివాలయం రూ. 610 కోట్ల వ్యయంతో పునర్నిర్మిస్తున్నారు.…
నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఎస్ఎస్ఎల్వీ-డీ2 ఎన్నో ప్రయోగాలతో అంతరిక్షంతో సత్తా చాటిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ని ఇవాళ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇక, దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రారంభమైంది. ఇది 6.30 గంటలపాటు కొనసాగి ఉదయం 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక…
తిరుమలలో రథసప్తమి వేడుకలు.. ఎప్పుడు ఏ వాహన సేవ అంటే.. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి.. రథసప్తమి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీవారి వాహన సేవలు ప్రారంభం అయ్యాయి.. ఇక, ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం, ఉదయం 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు…
టాలీవుడ్లో మరో విషాదం.. వెండితెర సత్యభామ కన్నుమూత.. టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఇవాల ఉదయం సీనియర్ సినీనటి జమున మృతిచెందారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. జమున మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె మృతి వార్త విన్నగానే టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికలుగా కొనసాగిన కథానాయికలు ఎందరో ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే తమ నటనా ప్రతిభతో పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ తనకంటూ…
కొత్త భవనాలు నిర్మించినంత మాత్రాన అభివృద్ధి కాదు.. తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌భవరన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది అన్నారు. మేధావులు, మహాన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారన్నారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ ఎంతో అంకితభావం…
అర్ధరాత్రి గాంధీభవన్‌లో ఉద్రిక్తత.. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనను భగ్నం చేశారు పోలీసులు.. ఎన్ఎస్యూఐ నేత బల్మురి వెంకట్, కార్పొరేటర్ విజయ రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులను అరెస్ట్ చేశారు.. అయితే, మాకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు.. 1600/800 మీటర్ల పరుగు పందెంలో క్వాలిఫై అయిన అభ్యర్థులను.. ఎగ్జామ్ రాసేందుకు అనుమతించాలని ఆందోళనకు చేశారు.. లాంగ్…
నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్… ‘వారాహి’కి పూజలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ కొండగట్టుకు వెళ్లనున్నారు.. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఆంజనేయస్వామి ఆలయంలో అక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్నారు పవన్… వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం ధర్మపురి…
ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చే శారు.. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ పార్లమెంట్లో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారు.. కానీ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఓ లీడర్ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదని విమర్శించారు.. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని పార్టీల నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు.. 70 ఏళ్లుగా మమ్మల్ని ఇదే…