అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త ఆంధ్రప్రదేశ్లో అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. ఎండలు మండిపోతున్నాయి, వడగాల్పులు అతలాకుతలం చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది.. నేడు 97 మండలాల్లో వడగాల్పులు, రేపు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.. ఈరోజు అల్లూరి జిల్లాలోని 2, అనకాపల్లిలో 1, బాపట్లలోని 7, తూర్పుగోదావరిలోని 7, పశ్చిమ గోదావరిలోని 3, ఏలూరులోని…
నెరవేరనున్న దశాబ్దాల కల.. బందర్పోర్టుకు నేడే శంకుస్థాపన కృష్ణా జిల్లా వాసుల దశాబ్దల కల నెరవేరనుంది. సుదీర్ఘ కాలం తర్వాత బందరు పోర్టు శంకుస్థాపనకు నోచుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బందరు పోర్టుకు ఇవాళ శంకుస్థాపన చేస్తారు. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బందరుకు హెలికాప్టర్ లో బయలుదేరతారు. తాపసిపుడి హెలిపాడ్ దగ్గర దిగి.. 9 గంటల 10 నిమిషాలకు పోర్ట్ దగ్గర భూమి పూజలో జగన్ పాల్గొంటారు. తర్వాత పైలాన్ను ఆవిష్కరిస్తారు.…
ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులు..! ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి.. వడగాలులు వృద్ధుల ప్రాణాలు తీస్తున్నాయి.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి.. పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతుండగా.. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక, ఈ రోజు అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు…
రాధ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. కారుతో తొక్కించి.. రాళ్లతో మోది..! ప్రకాశం జిల్లాలో హత్యకు గురైన రాధ కేసు కలకలం రేపుతోంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద హత్యకు గురైన రాధ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.. గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల కోసం వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వచ్చిన రాధ హత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి? అనే విషయాలపై ఆరా తీస్తే సంచలన…
గుడ్న్యూస్.. నేడే వారి ఖాతాల్లో రూ.10 వేలు మత్స్యకారులకు మరోసారి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా ఐదో ఏడాది…వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఈ ఏడాది లబ్ధి పొందనున్నారు.. వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15– జూన్ 14 కాలంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వ ఆర్ధిక సహాయం చేస్తూ వస్తుంది..…
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందినట్టు అధికారులు గుర్తించారు.. జిల్లాలోని కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగగా.. ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.. తిరుమల నుండి తాడిపత్రికి వెళ్తున్న తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ఉన్నట్టుగా తెలుస్తుండగా.. ఘటనా స్థలంలోనే ఏడుగురు మృత్యువాత…
నేడే టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి.. టెన్త్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. అయితే, టెన్త్ పరీక్షలు రాసిన ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. ఈ రోజు పదవ తరగతి ఫలితాల విడుదల చేస్తారు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు టెన్త్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో టెన్త్ ఫలితాలను ప్రకటించనున్నారు.. కాగా,…
మేడారం జాతరకు తేదీలు ఖరారు.. వివరాలు తెలిపిన పూజారులు ఆదివాసీలది విశిష్టమైన జీవన విధానం.. ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తున్నారు. మేడారం సమ్మక్క- సారలమ్మ ప్రకృతితో ఐక్యంగా ఉండే ఈ గిరిజనుల ప్రధాన దేవతలు. ఈ మహా జాతర ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగు రోజుల పాటు జరుగుతుంది. తాజాగా.. మేడారం జాతర- 2024 తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు. మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు…
కలకలం రేపిన ఈ-మెయిల్.. తిరుమలలో హై అలర్ట్.. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఏడుకొండలపై ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు వచ్చిన ఓ సమాచారం అందరినీ ఆందోళనకు గురిచేసింది.. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. దీంతో అప్రమత్తమైన పోలీసులు. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.. ఇక, తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు నిజమేనా అని తేల్చే పనిలో భాగంగా సీసీ…