నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్… ‘వారాహి’కి పూజలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ కొండగట్టుకు వెళ్లనున్నారు.. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఆంజనేయస్వామి ఆలయంలో అక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్నారు పవన్… వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం ధర్మపురి…