పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. వైసీపీ నేతల హెచ్చరిక! మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అరెస్ట్‌లతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తిరిగుబాటు తప్పదన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్ష్య పూరితంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. కాకాణిని అదుపులోకి తీసుకోవడంపై నెల్లూరు జిల్లా పోలీసులు అధికారిక ప్రకటన చేయాలని…
పాక్ ఉగ్రవాద దేశం.. ఈసారి దాడి చేస్తే.. నాశనం చేస్తాం! పాకిస్తాన్ దుర్మార్గాలను వివరించేందుకు సౌదీ అరేబియాతో పాటు కువైట్, బహ్రెయిన్ దేశాల పర్యటనకు ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం బహ్రెయిన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. గత చాలా సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేయడానికి మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపిందన్నారు. ఉగ్రవాద దేశం వల్ల మేము చాలా…
త్వరలోనే పెళ్లి.. ఇంతలో దుండగుడి కాల్పుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి ఆ జంట అందమైన జంట. చూడముచ్చటైన జంట. చిలకాగోరింకల్లా ఉన్నారు. వివాహం అనే బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని కలలు కన్నారు. కోరుకున్న చెలిమి దొరికిందని ఎంతగానో మురిసిపోయాడు. జెరూసలేంలో ఆమెకు ప్రపోజ్ చేసేందుకు ఉంగరం కూడా తీసుకున్నాడు. కానీ అంతలోనే మృత్యువు ఎదురొస్తుందని ఊహించలేకపోయాడు. ఓ దుర్మార్గుడు అకస్మాత్తుగా వచ్చి కాల్పులకు తెగబడడంతో అక్కడికక్కడే జంట నేలకొరిగింది. ఈ విషాద ఘటన వాష్టింగ్టన్‌లోని…
పోలీసుల తనిఖీలు.. భారీ “సైబర్ డెన్” గుర్తింపు..! విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ సైబర్ డెన్ ను గుర్తించారు పోలీసులు. దీనితో ఆ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతి, యువకులను తీసుకువచ్చి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని పరవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయనగరం ఉగ్ర మూలాలతో ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యారు.…
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం వెనుక అక్రమ కరెంట్ కనెక్షన్..! హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం మృత్యుపాశాన్ని మోసుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆ విషాదానికి మూలంగా అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్న ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభావిత భవనానికి ఎదురుగా ఉన్న నగల దుకాణం రాత్రి మూతపడిన అనంతరం, అక్కడి కొన్ని కుటుంబాలు హైటెన్షన్ వైర్ నుంచి కరెంట్‌ను కోక్కేల ద్వారా…
యువకుడికి వాట్సాప్ లో వలపు వల.. అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి.. ఈజీ మనీకోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మోసాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన యువకుడిని కరీంనగర్ యువకులు ట్రాప్ చేశారు. యువకుడికి వాట్సాప్ లో వలపు వల విసిరారు. వాట్సాప్ లో అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి.. బాదితున్ని కరీంనగర్ రప్పించారు కేటుగాళ్ళు. ఈ నెల 11న మంచిర్యాల నుంచి కరీంనగర్ వచ్చాడు సదరు యువకుడు.…
చైనాలో భూకంపం.. తీవ్రత 4.5గా నమోదు చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 6:59 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.5గా నమోదైంది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. శ్రీవారి భక్తులను మోసగించిన ట్రావెల్ ఏజెంట్.. లక్షా 25 వేలు వసూలు చేసి..! కలియుగ ప్రత్యక్షదైవం…
పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది.. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత, దౌత్య, సైనిక రంగాలలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిందని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి, అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ అన్నారు. అతను పాకిస్తాన్ తీరును తీవ్రంగా విమర్శించాడు. భారత్ తీసుకున్న సైనిక చర్యను ప్రశంసించాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఉగ్రవాద స్థావరాలపై వేగంగా, ఖచ్చితమైన రీతిలో దాడి…
జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం: జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం అని, బీజేపీ మతతత్వ పార్టీ కాదని జకియా ఖానం చేరిక ద్వారా చెపొచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కులమతాలకు తావులేకుండా భారతీయులుగా ముందుకెళ్లాలన్నది బీజేపీ నినాదం.. మూల సిద్ధాంతం అని చెప్పారు. దేశంలో బీజేపీ అద్భుతమైన పాలనను అందిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో దృఢమైన నిర్ణయం ప్రధాని మోడీ తీసుకున్నారని పురంధేశ్వరి ప్రశంసించారు. ఈరోజు ఉదయం వైసీపీ పార్టీకి గుడ్…