ఖమ్మం సభా వేదికపై వారు మాత్రమే ఉంటారు.. దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభగా ఖమ్మం సభ నిలిచిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఈనెల 18న ఖమ్మం సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో కేసీఆర్ కరీంనగర్ లో సింహగర్జన నిర్వహించారని, బీఆర్ ఎస్ తొలి సభను ఖమ్మంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఖమ్మం సభలో పలు జాతీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు. ఖమ్మం ప్రజల పోరాటం, మలి…