ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పులో కాలేశారు. టంగ్ స్లిప్ కావడంతో సీఎం జగన్‌కు బదులు మాజీ సీఎం చంద్రబాబు డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసలు కురిపించారు. వివరాల్లోకి వెళ్తే.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ… కరోనా కట్టడికి సీఎం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించకుండా ఉండలేమని స్పీకర్ అభిప్రాయపడ్డారు. వాలంటీర్లు, సచివాలయాల కాన్సెప్ట్‌ల ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వం చేపట్టే కోవిడ్ నివారణ చర్యలను తీసుకెళ్లే అద్భుతమైన యంత్రాంగాన్ని మనం…