నేపాల్ నుంచి టమాటా లోడుతో వస్తున్న వ్యాన్ నిన్న (ఆదివారం) ఉదయం 5 గంటల సమయంలో బీహార్ లోని రాంచీ-పాట్నా హైవే పైన వస్తుండగా డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో చర్హివ్యాలీ దగ్గర వ్యాన్ బోల్తా పడింది. దీంతో వ్యాన్ లోని టమాటాలు రోడ్ పైన పడిపోయాయి.. అది గమనించిన స్థానికులు దొరికిందే అవకాశంగా టమాటాలను ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు తీసుకెళ్లారు.