Tomato Price in Madanapalle Today: వంటింట్లో నిత్యం వాడే ‘టమాటా’ ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. గత 40-45 రోజులుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కొన్ని మార్కెట్‌లలో కిలో టమాటా రూ. 150 నుంచి 200 వరకూ పలుకుతోంది. దీంతో టమాటాలను కొనాలంటే సామాన్య ప్రజలు జడుసుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో.. టమాటా ధరలు పెరుగుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ క్రమంలో మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు రికార్డు…