అనంతపురం జిల్లా వాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. తోలుబొమ్మల తయారీలో ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లా నిమ్మలకుంట గ్రామం సోమవారం ఆనందంతో పులకించిపోయింది. తన ఒడిలో దశాబ్దాలుగా తోలుబొమ్మలు తయారు చేస్తూ గ్రామం పేరును దశదిశలా వ్యాపింపజేసిన కళామతల్లి ముద్దుబిడ్డ దళవాయి చలపతిరావుకు విశిష్ఠ పురస్కారం దక్కినందుకు పరవశించింది. సుప్రసిద్ధ కళాకారుడు దళవాయి చలపతిరావు సోమవారం ఢిల్లీలో ఉన్నత పురస్కారమైన పద్మశ్రీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు సంతోషంలో మునిగిపోయారు.…