సినీ పరిశ్రమలో కార్మికులు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదం మరోసారి వేడెక్కింది. ఫెడరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, నిర్మాతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాతలు తమకు నచ్చిన సమయాల్లో, తమకు నచ్చిన వారితోనే పని చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, కొందరు నిర్మాతలు సినీ కార్మికుల నైపుణ్యాలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. Also Read : Tollywood strike: కృష్ణానగర్‌లో సినీ కార్మికుల సమ్మె మరింత…
టాలీవుడ్‌లో గత వారం నుంచి కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మరియు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ, ఎటువంటి స్పష్టమైన పరిష్కారం దొరకకపోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ నేపధ్యంలో, కృష్ణానగర్‌లో 24 క్రాఫ్ట్ విభాగాలకు చెందిన వందలాది మంది కార్మికులు భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. Also Read : Tollywood strike : సినీ కార్మికుల 7వ రోజు సమ్మె అప్డేట్…
Tollywood : టాలీవుడ్‌లో వేతనాల పెంపుపై ఉత్కంఠ పెరిగింది. ఫెడరేషన్ రేపటి నుంచి 30% వేతనాలు పెంచితేనే షూటింగ్లకు హాజరవుతామని, లేనిపక్షంలో బంద్ ప్రారంభిస్తామని ప్రకటించిన నేపథ్యంలో తెలుగు ఫిలిం చాంబర్ నుండి అధికారిక ప్రతిస్పందన వచ్చింది. చాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ ఒక లేఖ విడుదల చేసి ఫెడరేషన్ నిర్ణయాన్ని ఖండించారు. Top Headlines @9PM : టాప్ న్యూస్ ఫెడరేషన్ పక్షపాతంగా 30% వేతనాల పెంపును డిమాండ్ చేస్తోందని దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు.…